నాగార్జున రవితేజ లను విమర్శిస్తున్న నెటిజన్లుraviteja and nagarjuna
raviteja and nagarjuna

టాలీవుడ్ హీరోలు నాగార్జున , రవితేజ లను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ హీరోలను నెటిజన్లు విమర్శించడానికి కారణం ఏంటో తెలుసా…….. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, యువ నాయకులు కేటీఆర్ పై ప్రశంసలు కురిపించడమే . కేసీఆర్ , కేటీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తారు కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టును అహర్నిశలు శ్రమించి పూర్తిచేసిన వ్యక్తి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.

 

అసలు వ్యక్తి హరీష్ రావు ని పొగడకుండా కేటీఆర్ ని పొగడటంతో నెటిజన్లకు కోపం వచ్చింది. పైగా హరీష్ రావు మాస్ లీడర్ కావడంతో అతడ్ని అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు హరీష్ కు అన్యాయం జరుగుతోందని. అందుకే కష్టపడిన హరీష్ ని పొగడకుండా నిర్లక్ష్యం చేసిన నాగార్జున , రవితేజ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీష్ రావు కు ఆహ్వానం అందలేదన్న విషయం తెలిసిందే.