సమంత పై నెటిజన్ల ఆగ్రహంఅక్కినేని కోడలు సమంత పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తాజాగా ఈ భామ పొట్టి గౌన్ వేసుకొని ఫోటోకు ఫోజివ్వడమే కాకుండా ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేసింది . ఇంకేముంది ఆ ఫోటోని చూసిన నెటిజన్లు సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్స్ చేశారు . సమంత పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసారు .

ఇక తాజా విషయానికి వస్తే ఈ భామ వేసుకున్న పొట్టి గౌన్ లో సమంత అందంగా కనిపించడం లేదు దానికి తోడు బక్కగా కనిపిస్తుండటంతో అస్థిపంజరంలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో . అంతేకాదు కాస్త తిని కండపెంచు ని ఉచిత సలహా కూడా ఇస్తున్నారు . అక్కినేని ఇంటి కోడలు అయ్యింది కాబట్టి కాస్త కట్టు బొట్టు తో కనిపించాలని భావిస్తున్నారు అభిమానులు కానీ సమంత మాత్రం ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోవడం లేదు .