దేవదాస్ టాక్ ఎలా ఉందంటే netizens review on devadas

అక్కినేని నాగార్జున , నాని ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం దేవదాస్ ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పడ్డాయి దాంతో ఈ సినిమాని చూసిన వాళ్ళు అప్పుడే సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్లు ఇస్తున్న రివ్యూ ప్రకారం దేవదాస్ యావరేజ్ మాత్రమే ! అంటే ప్లాప్ సినిమా అన్నమాట . నాగార్జున , నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయని అంతేతప్ప సినిమాలో కథ లేదని అలాగే ఆకట్టుకునే కథనం కూడా లేదని పెదవి విరుస్తున్నారు. దేవదాస్ చిత్రాన్ని చూసిన ఎక్కువమంది పెద్దగా బాగోలేదని తేల్చిచెబుతుండగా కొంతమంది నాని , నాగార్జున అభిమానులు మాత్రం సినిమా ప్లాప్ ఏమి కాదని బాగానే ఉందని ట్వీట్ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదలైంది దేవదాస్ చిత్రం . అయితే ఈ సినిమాకు మొదటి నుండి కూడా క్రేజ్ రాలేదు. నాగార్జున , నాని లాంటి మల్టీస్టారర్ చిత్రం అయినప్పటికీ అనుకున్న స్థాయిలో క్రేజ్ దక్కలేదు. నాగార్జున డాన్ గా నటించగా నాని డాక్టర్ గా నటించాడు. అయితే కొంతవరకు రష్మీక , వెన్నెల కిషోర్ ల పాత్రలు ఆకట్టుకున్నాయని అలాగే నాగార్జున , నాని ల మధ్య వచ్చే సీన్స్ మాత్రమే ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యానిస్తున్నారు దేవదాస్ పట్ల . ఓవరాల్ గా చెప్పాల్సి వస్తే దేవదాస్ చిత్రం మాత్రం హిట్ రేంజ్ అయితే కాదని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎలాంటి తీర్పు నివ్వనున్నారో కొద్ది సేపటిలోనే తెలిసిపోనుంది.

English Title: netizens review on devadas