రౌడీ హీరోని ఆడుకున్నారుగా!


Netizens shocks Vijay Deverakonda
Netizens shocks Vijay Deverakonda

`దేవ‌ర శాంటా` అనే హ్యాష్ ట్యాగ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ రోజు పెట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 2017 నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న అభిమానుల‌ని క‌లిసి గిఫ్ట్‌లు అంద‌జేస్తూ వ‌స్తున్నారు. ఈ ఏడాది ఆ కార్య‌క్ర‌మాన్ని కొంచెం కొత్త‌గా ప్లాన్ చేశారు. `దేవ‌ర శాంటా` మీరు ఏం కోరుకుంటే అది ఇస్తాన‌ని,  9 నుంచి 10 మంది వ‌ర‌కు వీలైతే ఎంత మందికి ఇవ్వ‌గ‌లిగితే అంత మంది కోరుకున్న బ‌హుబ‌తుల్ని ఇస్తాన‌ని ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

న‌చ్చి స్టార్ కోరింది ఇస్తానంటే నెటిజ‌న్స్ ఊరుకుంటారా వింత వింత కోరిక‌ల‌తో సోష‌ల్ మీడియా నిండా చిట్టా విప్ప‌డం మొద‌లుపెట్టారు. ఓ నెటిజ‌న్ నువ్వు నాకు స్ఫూర్తి అని, త‌న సెమిస్ట‌ర్ ఎక్జామ్స్ రాసిపెట్ట‌మ‌ని, మ‌రొక‌రేమో మ్యాక్ బుక్ లేదు బ్రో కొంచెం కొని పెట్ట‌వు అని వింత వింత కోరిక‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పిచ్చెక్కిస్తున్నారు. కొంత మందేమో ఇలాకాదు కానీ ఫ్యాన్స్ మీట్ పెట్టు బ్రో అని స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి కొంత మంది మాత్రం మాకు గిఫ్ట్స్ అంటూ ఏమీ వ‌ద్ద‌ని చ‌లికాలం రోడ్ఉ ప‌క్క‌న ఎలాంటి ఆధారం లేకుండా జీవించే వారికి క‌నీసం క‌ప్పుకోవ‌డానికి బ్లాంకెట్స్ కొనిస్తే బాగుంటుందని చెబుతున్నారు.

ఒక ఓ కొంటె అభిమాని మాత్రం వింత చిలిపి కోరిక‌ని కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం నితిన్ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో వుంది. అక్క‌డ ఓ ఐస్‌క్రీమ్ పార్ల‌లో ర‌ష్మిక దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో వైర‌ల్ అయ్యాయి. ఆ ఫొటోల‌ని ట్వీట్ చేస్తూ ఓ కొంటె అభిమాని ర‌ష్మిక ఇట‌లీలో వుంది కాబ‌ట్టి మాకు గిఫ్ట్‌లు కాకుండా ఆమె తిన్ని ఐస్ క్రీమ్ షాప్ నుంచే చాకొలేట్ ఐస్‌క్రీమ్‌లు ఇట‌లీ నుంచి తెప్పిస్తే బాగుంటుద‌ని ట్వీట్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో న‌వ్వుల వ‌ర్షం కురుస్తోంది.