హీరోయిన్‌ని ఆడుకున్న నెటిజ‌న్స్‌! 

netizens slams bollywood actress Swara bhaskar
netizens slams bollywood actress Swara bhaskarnetizens slams bollywood actress Swara bhaskar

సుశాంత్ రాజ్‌పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. థ్రిల్ల‌ర్ ని త‌ల‌పించే స్థాయిలో సుశాంత్ మ‌ర‌ణం వెన‌క స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. రోజుకో విష‌యం బ‌య‌టికి రావ‌డంతో సుశాంత్ ది ఆత్మ హ‌త్య కాద‌ని హ‌త్యేన‌ని బ‌లంగా వినిపిస్తోంది. సుశాంత్ హ‌త్య‌కు రియానే ప్ర‌ధాన కార‌కురాలంటూ సుశాంత్ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, బాలీవుడ్‌లో కొంత మంది సెల‌బ్రిటీలు సుశాంత్ మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందే అంటూ బాహాటంగానే గ‌ళం వినిపిస్తున్నారు.

ఇదిలా వుంటే రియా తాజాగా సుశాంత్ విష‌యంలో మీడియా అతి చేస్తోంద‌ని, త‌న‌ని దోషిగా చిత్రించాల‌ని చూస్తోంద‌ని ఆరోపిస్తూ మీడియాపై సుప్రీమ్‌కు వెళ్లింది. ఆమెకు అండ‌గా బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్ నిలిచి ట్వీట్ చేయ‌డం బాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. కొన్ని మీడియా సంస్థ‌ల పేర్ల‌ని మార్చి చూపిస్తూ సుశాంత్ కేసులో కావాల‌నే రియాను ఇరికిస్తున్నార‌ని, దీనిపై న్యాయ‌స్థాన‌మే నిర్ణ‌యాన్ని చెబుతుందంటూ ట్వీట్ చేసింది.

దీంతో నెటిజ‌న్స్ ఒక్క‌సారిగా స్వ‌ర భాస్క‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. బాలీవుడ్ మాఫియాలో స్వ‌ర కూడా ఓ భాగ‌మంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీబీఐ దోషిగా తేలుస్తున్నా బాలీవుడ్ మాఫియా రియాని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై స్వ‌ర భాస్క‌ర్ మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు.