ఫొటోస్టోరీ: క‌ంప్లీట్ ఫారిన‌ర్‌గా మారిపోయిందే!

Netizens trolling to priyanka chopra
Netizens trolling to priyanka chopra

అమెరిక‌న్ పాప్ సింగ‌ర్‌, యాక్ట‌ర్ నిక్ జోన‌స్‌ని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లికి ముందు వ‌ర‌కు భార‌తీయ స్త్రీలా వ్య‌వ‌హ‌రించిన ప్రియాంక పెళ్లి త‌రువాత నుంచి నెమ్మ‌ది నెమ్మ‌దిగా పాశ్చాత్య పోక‌డ‌లు పోతోంది. త‌ను భార‌తీయ స్త్రీకి ప్ర‌తిబింబం అని తెలిసి కూడా పాశ్చ‌త్య నాగ‌రిక‌త‌, వ‌స్త్ర‌ధార‌ణ‌కు క్ర‌మంగా ఎడిక్ట్ అయిపోతున్న తీరు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీస్‌తో పాటు ఆమె అభిమానుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

తాజాగా అమెరికాలో గ్రామీ అవార్డుల వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు హాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌న భ‌ర్త నిక్ నిక్ జోన‌స్‌తో క‌లిసి ప్రియాంక పాల్గొంది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం ఎబ్బెట్టుగా వుండ‌టంతో నెటిజ‌న్స్ ఆమెపై ఘాటుగా కాంమెంట్‌లు చేస్తున్నారు. భార‌తీయ స్త్రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా వుండాల్సిన ప్రియాంక వ‌ల్గ‌ర్ డ్రెస్సుల్లో క‌నిపిస్తూ దేశ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

గ్రామీ అవార్డు ఫంక్ష‌న్‌లో పాల్గొన‌డం కోసం ప్రియాంక ప్ర‌త్యేకంగా ఓ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుంది. అయితే ఆ డ్రెస్‌లో ప్రియాంక యెద అందాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం, చాలా వ‌ల్గ‌ర్‌గా డ్రెస్ డిజైన్ వుండ‌టంతో నెటిజ‌న్స్ ఇదే డ్రెస్సింగ్ సెన్స్ అంటే.. అందాలు ఆర‌బోయ‌డానికేనా ఇలాంటి డ్రెస్‌ని డిజైన్ చేయించుకున్నావ‌ని విరుచుకుప‌డుతున్నారు. దీనిపై ప్రియాంక మాత్రం స్పందించ‌డం లేదు.

 

View this post on Instagram

 

Tassel fun. #grammys

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on