మహేష్ భార్య ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్


మహేష్ భార్య ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
నమ్రత మరియు మహేష్ బాబు

మహేష్ బాబు భార్య నమ్రత ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు . మహేష్ భార్యని ట్రోల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన వెంకటేష్ కు అలాగే విజయ్ దేవరకొండ కు థాంక్స్ చెబుతూ నమ్రత ట్వీట్ చేయడమే ! విజయ్ దేవరకొండ , వెంకటేష్ లకు థాంక్స్ చెప్పిన నమ్రత అల్లరి నరేష్ ని మాత్రం పట్టించుకోలేదని భావించిన నెటిజన్లు అల్లరి నరేష్ కు కూడా చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు .

అయితే నమ్రత ఉద్దేశ పూర్వకంగా అలా చేయలేదు ఎందుకంటే అల్లరి నరేష్ మహర్షి సినిమాలో కీలక పాత్రలో నటించాడు కాబట్టి అల్లరి నరేష్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పలేదు కానీ ముఖ్య అథితులుగా వచ్చిన సీనియర్ హీరో వెంకటేష్ , విజయ్ దేవరకొండ లను మాత్రం ప్రత్యేకంగా ట్రీట్ చేసింది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటోంది . కానీ ట్వీట్ వల్ల అల్లరి నరేష్ ఫ్యాన్స్ ని ఫీల్ అయ్యేలా చేసింది .