మారవయ్యా ! లోకేషు …… ఆ భాషేంది ?Netizens trolls Nara lokesh

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఇప్పటికి కూడా మారలేదు , తన ప్రసంగాలపై ఎన్ని విమర్శలు వస్తున్నా ….. ప్రత్యర్ధులు అంతా పప్పు , ముద్దపప్పు అంటున్నా ……. తన ప్రసంగాల్లో తప్పులు దొర్లుతున్నా ఇంకా జాగ్రత్త పడటం లేదు పాపం . రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో అంటే ఫ్లో లో తప్పులు దొర్లుతుంటాయని అనుకోవచ్చు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది అయినప్పటికీ ప్రత్యర్థులకు ఇప్పటికి కూడా ఊతం ఇస్తూనే ఉన్నాడు విమర్శల పాలు అవుతూనే ఉన్నాడు నారా లోకేషు .

 

నిన్నటికి నిన్న వై ఎస్ వివేకానంద మరణంపై స్పందించాడు నారా లోకేష్ ,ఆయన హత్య బాధించింది అని చెప్పడం బాగానే ఉంది ఆ హత్యతో పరవశించాం అని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . నారా లోకేష్ ఇలాంటి మాటలతో చులకన అవుతున్నాడు . ఇకనైనా మరవయ్యా ! లోకేషు …… ఆ భాషేంది అని అంటున్నారు నెటిజన్లు .

English Title : Netizens trolls Nara lokesh