విజయ్ దేవరకొండ తమ్ముడి పై విమర్శలు


Anand-Devarakonda-dance
Anand-Devarakonda-dance

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా జూలై 5 న విడుదల కానుంది . అయితే అందులో హీరోయిన్ గా నటించిన రాజశేఖర్ కూతురు శివాత్మిక ఆనంద్ దేవరకొండ తో కలిసి ఓ డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది . ఆ వీడియో వల్లే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పై విమర్శలు రావడానికి కారణం .

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే ఆనంద్ దేవరకొండ – శివాత్మిక ఇద్దరు కూడా రాజశేఖర్ కల్కి చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్ చేసారు . శివాత్మిక అలవోకగా డ్యాన్స్ చేయగా ఆనంద్ దేవరకొండ మాత్రం సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాడు దాంతో నెటిజన్లు ఆనంద్ పై విమర్శలు చేస్తున్నారు . రాజశేఖర్ కల్కి ఈనెల 28 న విడుదల అవుతుండగా దొరసాని మాత్రం జూలై 5 న విడుదల అవుతోంది .