ప్రభాస్ సాహో సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు


ప్రభాస్ సాహో సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు
ప్రభాస్ సాహో సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటింస్తున్న సాహో ఈనెల 30 న విడుదల అవుతున్న నేపథ్యంలో నిన్న ” ఏ చోట నువ్వున్నా ” అనే పాటని విడుదల చేసారు . విజువల్ గా బాగుంది కానీ ఈ పాట మక్కీకి మక్కి కాపీ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు . ఈ కాపీ సాంగ్ ఏంట్రా బాబూ ! అంటూ అసలు పాటని దానికి లింక్ కలుపుతూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు .

సాహో చిత్రం పై ఇప్పటికే పలు అనుమానాలు నెలకొన్నాయి . ఇక ఇప్పుడేమో పాటల రూపంలో విమర్శలు వస్తున్నాయి . మొదటి పాట సైకో సయ్యా అనే పాటపై కూడా దుమారం చెలరేగింది దాంతో దాని నుండి దృష్టి మరల్చడానికి ఏ చోట నువ్వున్నా అంటూ పాటని విడుదల చేసారు . ఇక ఈ పాటపై మరింతగా విమర్శలు వస్తున్నాయి . సినిమా రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో అంచనాలు పెరగాలి కానీ ఇలా దుమారం రేగడం అంటే ఖచ్చితంగా సినిమా ఫలితం పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది