విజయ్ దేవరకొండ తమ్ముడ్ని టార్గెట్ చేసారు


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడ్ని టార్గెట్ చేసారు కొంతమంది దాంతో నిన్న ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని చిత్ర టీజర్ విడుదల అవ్వడమే ఆలస్యం సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండ పై పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది . కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన దొరసాని చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు .

అయితే నిన్న దొరసాని చిత్ర టీజర్ విడుదల చేసారు . రాజశేఖర్ – జీవిత ల కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు . అయితే శివాత్మిక కు ప్రశంసలు దక్కుతుండగా ఆనంద్ దేవరకొండ కు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి నటన పరంగా లుక్స్ పరంగా . టీజర్ తోనే ఇన్ని విమర్శలు వస్తే ఇక సినిమాతో ఎన్ని విమర్శలు వస్తాయో మరి . ఈ హీరో అన్న విజయ్ దేవరకొండ లాగా హిట్ అవుతాడా ? లేక చతికిల బడతాడా ? వచ్చే నెలలో తెలిసిపోనుంది .