ఫస్ట్ డే ఫస్ట్ షో నేచురల్ స్టార్ ఫిక్సయిపోయాడు!


ఫస్ట్ డే ఫస్ట్ షో నేచురల్ స్టార్ ఫిక్సయిపోయాడు!
ఫస్ట్ డే ఫస్ట్ షో నేచురల్ స్టార్ ఫిక్సయిపోయాడు!

కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. కార్తిక్ ఈశ్వర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన తనయుడి అన్వేషణలో వై యువతీ ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

విభిన్నమైన పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా మేకర్స్ ప్రముఖ ఓటీ టీ సంస్థ అమెజాన్ ప్రిమెలో ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నారు. అత్యంత భారీ మొత్తానికి ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే టీజర్ ని రిలీజ్ చేశారు.
తాజాగా గురువారం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లలో అమెజాన్ ప్రైమ్ లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలెర్ ని మలయాళంలో మోహన్ లాల్ , తమిళంలో ధనుష్, తెలుగులో నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ‘పెంగ్విన్‘ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫిక్స్ ‘
అని నాని ట్వీట్ చేశారు.

Credit: Youtube