మరోసారి వెండితెర పై కాశ్మీర్ నేపధ్యంNew movie on Kashmir issue
New movie on Kashmir issue

కాశ్మీర్ రాష్ట్రంలో చరిత్రలో ఒకరోజు ఆకస్మాత్తుగాసాయంత్రం వేళ మైకులలో కాశ్మీరీ పండిట్స్ ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అనీ,లేకపోతే చంపేస్తాం అని బెదిరింపులు మొదలెట్టి, అక్కడితో ఆగకుండా ఎంతోమందిని బెదిరించి,చంపి, అత్యాచారాలు చేసి ఈదేశంలో పుట్టిన తోటి ప్రజలను ఈదేశంలోకే శరణార్ధులుగా నెట్టేశారు కొంత మంది రాక్షసులు. ఆ తర్వాత చరిత్రలో ఇలాంటి మారణ హోమాలు అసలేం లేనట్టు,జరగనట్టు ఎన్నో చేదు నిజాలను తొక్కిపెట్టారు. ప్రస్తుతం పరిస్థితులు మారి, చరిత్ర దాచిన ఎన్నో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగులో కాశ్మీరీ పండిట్ ల ఊచకోతల నేపధ్యంలో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమా గత ఏడాది వచ్చింది. హిందీలో ప్రముఖ దర్శక, నిర్మాత విదు వినోద్ చోప్రాశిఖర” అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ మరొక దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాశ్మీరీ పండిట్ లకు జరిగిన అన్యాయాల నేపధ్యంలో “ద కాశ్మీర్ ఫైల్స్” అనే సినిమా ప్రారంభించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన చార్మీనార్ వద్దనున్న భాగ్యనగర్ లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించారు. “మన దేశంలో గతంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలని, ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసానని ఫిబ్రవరి లో సినిమా రిలీజ్ చేస్తానని” వివేక్ ప్రకటించారు. హైదరాబాద్ వచ్చిన వివేక్ సర్ ను టాలీవుడ్ నుండి అనిల్ సుంకర, టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.