టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు


టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు
టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు

న్యూస్ చానెల్స్ మన తెలుగునాట బాగా పాపులర్ అయ్యాయి. రాజకీయం గురించి డిబేట్స్ పెడతారు, సినిమా స్టార్ల మీద పుకార్లు పుట్టిస్తారు ఇదంతా ఎందుకు అంటే మాకు టి.ఆర్.పి రేటింగు కావలి అంటారు. అవసరమయిన అలాగే జ్ఞానం పెంపొందించే వాటిని చూపిస్తే ఏం వస్తుంది కిక్?….ఇలాంటివి చూపిస్తేనే కదా టి.ఆర్.పి రేటింగు పెరిగేది…మరి చూస్తున్న జనాలు వెర్రి వాళ్ళ? అలా జనాలు గ్రహించడం కష్టమే అని సులువుగా అనుకుంటారు.

టీవీ 9 ఛానల్ ఒకప్పుడు పెద్ద నంబర్ 1 ఛానల్. ఎప్పుడైతే “రవి ప్రకాష్” గారు ఛానల్ నకిలీ సంతకం కారణంగా ఒక్కసారిగా తల దించుకున్న టీవీ 9 ఇకనైనా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జనాలని వినోదింప చేస్తుందా? అంటే మళ్ళీ కుక్క వంకర తోకలాగానే మేము ప్రత్యక్షంగా చూపిస్తున్న వీడియో అంటూ సొంత డప్పు కొట్టుకుంటుంది. అసలు టీవీ 9 చేసే కార్యక్రమాలలో ‘ఏది వైరల్? ఏది రియల్?’ కార్యక్రమం జనాన్ని తెగ ఇబ్బంది పెట్టేది. అది చాలదు అనుకున్నట్టుగా ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాన్ని మొదలు బెడుతూ మళ్ళీ పాత టి.ఆర్.పి రేటింగుల కోసం పాకులాడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ ‘రవితేజ‘ గారు ‘వి.ఐ ఆనంద్’ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘డిస్కో రాజా’. ఆ సినిమా లోని ముఖ్యమైన సన్నివేశాలు కథ కి అనుగుణంగా ‘ఐస్ల్యాండ్’ లో మంచు కొండల మధ్య షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో ఆ సీన్స్ బాగా ఇంపార్టెంట్ అని విన్నాం కదా. అయితే నిర్మాతలు, కొంతమంది యూనిట్ సభ్యులు ఆ ఫోటోలని మాధ్యమాల్లో పెడితే దానికి టీవీ 9 వాళ్ళు కొంచెం మసాలా జోడించి అనగా ఒక వీడియో తయారు చేసి టీవీ 9 ప్రత్యక్షంగా అందిస్తున్న వీడియో అని చెప్పి జనాలని వెర్రి బాగులోళ్ళని చేస్తుంది టీవీ 9.

అది చూసిన జనం ప్రత్యక్షంగా అంటే లైవ్ లో జరుగుతుండగా ఆ వీడియో ని షూట్ చేయడం కానీ, లేదా మీకు ఆ వీడియో దొరికితే మొదట మీరు చూపిస్తే దాన్ని ప్రత్యక్షం అంటారు కానీ 4,5 ఫోటోలని పెట్టేసి చూస్కోండి అంటే జనాలు మిమ్మల్ని వెర్రి బాగోలోళ్లు అనుకుంటారు అని కింద కామెంట్ రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా టీవీ 9 వారు ఇది గ్రహించి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటుందా? అంటే ఆబ్బె వాళ్ళు అంతే ఇక మారరు అని జనాలు అనుకుంటున్నారు…..అందులో చాల నిజం వుంది అది మనకి కూడా తెలుసు.