బిగ్ బాస్ 3లో తారాస్థాయికి చేరిన గొడవలు 


new task lead to fight in bigg boss 3
బిగ్ బాస్ 3లో తారాస్థాయికి చేరిన గొడవలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఈసారి కొంచెం చప్పగా సాగుతుందని చెప్పాలి. టాస్క్ లు అంత ఆసక్తికరంగా లేకపోవడం, ఇంటిసభ్యులు కూడా ఎంతసేపూ సేఫ్ గేమ్ ఆడేందుకే చూస్తుండడంతో బిగ్ బాస్ లో ఒకరకమైన నిస్తేజం ఆవహించింది. మొన్న ఛలో ఇండియా టాస్క్ తో ఒకరకమైన జోష్ వచ్చినా అది సరిపోలేదు.

అందుకే బిగ్ బాస్ యాజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా యాంకర్ శిల్ప చక్రవర్తిని రంగంలోకి దింపారు. ఆమె రావడమే ఇంట్లో పరిస్థితులని అర్ధం చేసుకుని వచ్చింది. మొదటి రోజే ఇంట్లో అందరి ఫేవరెట్ అయిన బాబా భాస్కర్ తో గొడవ పడింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌజ్ లో దొంగతనం జరిగింది. హౌజ్ మేట్స్ కు సంబంధించిన కొన్ని వస్తువులను కొంతమంది దొంగలు లాకెళ్ళిపోయారు.

దీనితర్వాత ఇంటిసభ్యులకు దొంగలు దోచిన నగరం అని టాస్క్ ఇచ్చాడు. ఇందులో దొంగలుగా వరుణ్, రాహుల్, రవి, పునర్నవి, శివజ్యోతి ఉండగా, దొంగలకు రాణిగా శిల్పను ఎంపిక చేసారు. నగరవాసులుగా శ్రీముఖి, హిమజ, వితిక, బాబా భాస్కర్, మహేష్, అలీలను సెలెక్ట్ చేసారు. ఈ టాస్క్ మొదలైన దగ్గరనుండి ఇంటిసభ్యులు ఒకరిపై ఒకరు దాడికి దిగడం, దూషించుకోవడంతో నిన్నటి ఎపిసోడ్ రచ్చరచ్చగా మారింది. మరి ఈరోజు కూడా ఈ టాస్క్ ఉండడంతో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.