ప్రభాస్ 20 గురించి ఆసక్తికర అప్డేట్


ప్రభాస్ 20 గురించి ఆసక్తికర అప్డేట్
ప్రభాస్ 20 గురించి ఆసక్తికర అప్డేట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తన తర్వాతి చిత్రం విషయంలో మార్పులు చేర్పులు సూచించిన విషయం తెల్సిందే. బడ్జెట్ పరిమితుల దగ్గరనుండి షూటింగ్ గ్యాప్స్ వరకూ అన్నీ డిస్కస్ చేసుకుని ఇప్పుడు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నారు. హైదరాబాద్ లో ఇటీవలే మొదలుపెట్టిన షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్, హీరోయిన్ పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా ఉంటుందని కూడా దర్శకుడు ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఊరించాడు.

అలాగే ఈ సినిమాను మొదట సమ్మర్ 2021 కి విడుదల చేయాలని భావించారు. ఈ మేరకు ఇటీవలే నిర్మాత, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు రివీల్ చేసారు కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం అందులో కూడా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రభాస్ షూటింగ్ కు డేట్స్ వరసగా ఇచ్చి ఈ దసరాకు విడుదలయ్యేలా చూడాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను కూడా దృష్టిలో ఉంచుకుని తమ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఏదేమైనా ఈ ఏడాదే ప్రభాస్ 20 రిలీజ్ ఉంటుంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి భారీ బిజినెస్ డీల్స్ తో ముందుకొస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తాజా సమాచారం ప్రకారం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 25 కోట్ల భారీ డీల్ తో ఓవర్సీస్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తెలుగు వెర్షన్ వరకేనా లేక మిగిలిన భాషలకు కూడా కలిపా అన్న విషయం తేలాల్సి ఉంది.