పాపం నవంబర్ నెల ఏమి చేసింది?


పాపం నవంబర్ నెల ఏమి చేసింది
పాపం నవంబర్ నెల ఏమి చేసింది

ఈ ఏడాది తెలుగు సినిమా రిలీజ్ విషయాలలో మనం చూసుకుంటే వారానికి పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే, మాకు అదే డేట్ కావలి అని మధ్యలో వచ్చి సినిమా రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి అలా చేయటం కొంతమందికి హిట్స్ దక్కేలా చేస్తే, కొంతమందికి కోలుకోలేని దెబ్బలాగ ఫ్లాప్స్ ఎదురయ్యాయి.

అయితే అలా వరుసగా రిలీజ్ చేయడానికి కారణం సీజన్ కలిసిరావడం. పోనీ అలా వచ్చినవి హిట్ అయినవి అంటే ఒక్క వారం వవధిలోనే ఇంకొక భారీ సినిమా వచ్చి గతవారం వచ్చిన సినిమా మీద ప్రభావం బాగా పడింది. అటు నిర్మాతలకి, ఇటు డిస్ట్రిబ్యూటర్ లకి మాత్రమే నష్టం కలిగింది ఇలా చేయటం వల్ల.

మరి వచ్చే నవంబర్ నెలని మాత్రం నిర్మాతలు వదిలేసారు అని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ నెలలో పలానా సినిమా రిలీజ్ అవుతుంది అని ఏ నిర్మాత చెప్పకపోవడం అందరిని ఆలోచింప చేస్తుంది.

చూసుకుంటే చిరంజీవి సైరా దగ్గరనుండి, వెంకీ మామ, చాణక్య, మీకు మాత్రమే చెప్తా లాంటి సినిమాలు అన్ని అక్టోబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి తప్ప నవంబర్ నెలలో ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికి అయినా నిర్మాతలు ఇది గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం.