హీరోల గుండెల్లో నిద్ర పోతున్న తమిళ రాకర్స్


NGK full movie leaked by Tamilrockers

భారీ బడ్జెట్ తో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి చిత్రాలను నిర్మించి రేయింబవళ్లు కష్టపడుతుంటే తమిళ రాకర్స్ మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా ,సిగ్గూ శరం లేకుండా సినిమాలు విడుదలైన రోజునే పైరసీ చేస్తూ హీరోల గుండెల్లో నిద్ర పోతోంది . భారీ సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తాయి అయితే ఆ ఓపెనింగ్స్ తక్కువ కావడంలో తమిళ రాకర్స్ కారణం అవుతోంది .

ఇప్పటికే పలువురు హీరోలకు చెప్పి మరీ ఆ చిత్రాలను పైరసీ చేసిన తమిళ రాకర్స్ తాజాగా విడుదలైన సూర్య చిత్రం NGK , ఫలక్ నుమా దాస్ అనే చిత్రాలను పైరసీ చేసి నెట్ లో పెట్టేశాయి . ఇప్పటికే ఓపెనింగ్స్ లేక , డివైడ్ టాక్ తో చచ్చి బ్రతుకుతున్నాయి , ఇలాంటి సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తమిళ రాకర్స్ పైరసీ వీడియో వల్ల ఆ సినిమాలు మరింత దారుణంగా దెబ్బ తిననున్నాయి . ఎంతమంది హీరోలు తమిళ రాకర్స్ ఆట కట్టించాలని చూసినప్పటికీ కుదరడం లేదు పాపం .