క‌రోనాపై పోరులో నేను సైతం అంటున్న నిధి అగ‌ర్వాల్‌

క‌రోనాపై పోరులో నేను సైతం అంటున్న నిధిఅ గ‌ర్వాల్‌
క‌రోనాపై పోరులో నేను సైతం అంటున్న నిధిఅ గ‌ర్వాల్‌

నాగ‌చైత‌న్య న‌టించిన `స‌వ్య‌సాచి` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. అంత‌కు ముందే బాలీవుడ్ చిత్రం `మున్నా మైఖేల్` నిధికి మంచి పేరు తెచ్చిపెట్టింది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన ఈ చిత్రం త‌రువాత నిధి అగ‌ర్వాల్ టాలీవుడ్‌లోకి ప్ర‌వేశించింది. ఇటీవ‌ల రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా త‌రువాత టాలీవుడ్‌లో వున్న క్రేజీ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ టైమ్‌ని బాగానే స‌ద్వినియోగం చేసుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సుని ఆన్‌లైన్‌లో నేర్చుకుంటూ ఈ క్వారెంటైన్ టైమ్‌ని గ‌డిపేస్తోంది. రానున్న సినిమాల్లో త‌న న‌ట‌న‌కు మెరుగులు దిద్దుకుంటూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా క‌రోనా క్రైసిస్‌లో నేను సైతం అంటూ త‌న వంతు బాధ్య‌త‌గా స‌హాయం చేయ‌డానికి ముందుకొచ్చింది. పీఎం కేర్స్‌తో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన క‌రోనా క్రైసిస్ ఛారిటీకి త‌న వంతు విరాళం అంద‌జేసింది. దాంతో పాటు మూగ జీవాల‌కు సంబంధించిన వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌తో పాటు స్ఫూర్తి సంక్షేమ సంఘంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్ర‌క‌టించింది.