మూడేళ్ల  విరామం త‌రువాత..!

మూడేళ్ల  విరామం త‌రువాత..!
మూడేళ్ల  విరామం త‌రువాత..!

మూడేళ్ల విరామం త‌రువాత నిధి అగ‌ర్వాల్ మ‌ళ్లీ బాలీవుడ్ బాట ప‌డుతోంది. 2017లో టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `మున్నా మైఖేల్‌`. ఈ మూవీతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది నిధి అగ‌ర్వాల్‌. ఈ మూవీ చూసిన మ‌న వాళ్లు హైద‌రాబాదీ అమ్మాయి అని తెలియ‌డంతో తెలుగులో అవ‌కాశాలిచ్చారు. `స‌వ్య‌సాచి` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌రువాత చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోవ‌డంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నిధికి `ఇస్మార్ట్ శంక‌ర్` రూపంలో పూరి జ‌గ‌న్నాథ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించారు. అయినా తెలుగులో భారీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోతోంది. ప్ర‌‌స్తుతం త‌మిళంలో భూమి, శింబుతో `ఈశ్వ‌రుడు` చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగులో కేవ‌లం కొత్త హీరో అశోక్ గ‌ల్లా మూవీలో న‌టిస్తోంది.

ఇలా భారీ ఆఫ‌ర్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగ‌ర్వాల్ కు తాజాగా బాలీవుడ్ ఆఫ‌ర్ ల‌భించింద‌ని తెలిసింది. తెలుగు, త‌మిళంలో అంగీక‌రించిన చిత్రాలు పూర్త‌యిన త‌రువాత నిధి బాలీవుడ్‌కు వెళ్ల‌నుంద‌ట‌. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని నిధి అగ‌ర్వాల్‌ త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.