అర్జున్ రెడ్డి లా నటించాలని ఉందట ఈ భామకు

Nidhi agerwal wants like arjun reddy characters రెండేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రాన్ని ఒకసారి కాది రెండుసార్లు కాదు ఏకంగా అయిదారు సార్లు చూసిందట అందాల భామ నిధి అగర్వాల్ . సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ భామ . ఆ సమయంలో నాగచైతన్య అర్జున్ రెడ్డి చిత్రం చూడమని చెప్పాడట దాంతో ఆ సినిమాని చూసిందట . ఇంకేముంది సినిమా బాగా నచ్చడంతో అయిదారు సార్లు చూశానని , నాకు కూడా అలా నటించాలని ఉందని అంటోంది నిధి అగర్వాల్ .

తాజాగా ఈ భామ అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది . ఆ సినిమా విడుదలైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చింది . సవ్యసాచి , మిస్టర్ మజ్ను చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ తాజాగా మూడో సినిమా ఇస్మార్ట్ శంకర్ లో నటించే ఛాన్స్ మాత్రం కొట్టేసింది ఈ భామ . మొదటి రెండు చిత్రాలు సరిగ్గా ఆడలేదు మరి ఈ సినిమానైనా ఆడుతుందా చూడాలి .

English Title: Nidhi agerwal wants like arjun reddy characters