పవన్ పక్కన ఇస్మార్ట్ భామ సెట్ అవ్వదు అంటున్నారే!


పవన్ పక్కన ఇస్మార్ట్ భామ సెట్ అవ్వదు అంటున్నారే!
పవన్ పక్కన ఇస్మార్ట్ భామ సెట్ అవ్వదు అంటున్నారే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. వాటిలో అత్యంత ఆసక్తి కలిగించేది కచ్చితంగా క్రిష్ దర్శకత్వంలో సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ – క్రిష్ కాంబినేషన్ లో సినిమా ఎవరూ ఊహించలేదు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు క్రిష్. ఈ సినిమా  షూటింగ్ లాక్ డౌన్ కు ముందు దాదాపు 15 రోజుల షూటింగ్ జరిగింది. ఇక డిసెంబర్ లో మరో షెడ్యూల్ జరుగుతుందని అంటున్నారు. బాలీవుడ్ నటులు జాక్వెలిన్, అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ను ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా అనుకుంటున్నారు అన్న వార్తలు హల్చల్ చేసాయి. దీంతో మెగా అభిమానుల్లో ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. దీనికి రెండు కారణాలు చెప్తున్నారు. మొదటిది పవన్ పక్కన ఆమె సెట్ అవ్వదట. రెండోది ఇంత పెద్ద సినిమాలో ఇంకా పెద్ద హీరోయిన్ ను తీసుకోవాలని వారు భావిస్తున్నారు.