ఆ హీరోతో పడుకుందట


రాత్రి బాగా పొద్దుపోవడంతో పాటు ఆ స్టార్ హోటల్ తనకు బాగా నచ్చడంతో ఆ హోటల్ లోనే నేను – విక్కీ కౌశల్ పడుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేసింది తాప్సి . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తెలుగు చిత్రాలను వదిలేసి బాలీవుడ్ చిత్రాలను మాత్రమే చేస్తోంది . లెజెండ్ అమితాబ్ తో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ విక్కీ కౌశల్ సరసన
” మన్మర్జియాన్ ” చిత్రంలో నటించింది .

తాజాగా బాలీవుడ్ లో ఓ టాక్ షోలో పాల్గొన్నారు తాప్సి – విక్కీ కౌశల్ . అయితే ఆ టాక్ షోలో అప్రయత్నంగానే ఓ సంచలన విషయాన్నీ చెప్పేసింది . ఓ రోజు రాత్రి ఓ స్టార్ హోటల్ కు వెళ్లారట ! అక్కడే కబుర్లు చెప్పుకొని డిన్నర్ చేసారు . అయితే కబుర్లలో పడి ఆలస్యం అయ్యింది దాంతో ఇంటికి వెళదాం అని లేచాడట విక్కీ కానీ తాప్సి ఊరుకుంటేగా ……. ఈ రాత్రికి ఇక్కడే అంటూ గోల గోల చేసిందట . దాంతో చేసేదిలేక ఆ హోటల్ లోనే రాత్రంతా గడిపారట . తెల్లవారు ఝామున ఆ హోటల్ నుండి ఇంటికి వెళ్లారట ! తాప్సి మాటలు చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ లో .