పాపం ! నిహారిక మూడు సినిమాలు ప్లాప్


niharika completed hattrick flops

”ఒక మనసు” తెలుగులో , ”ఒరు నల్ల నాల్ పాతు సోల్రేన్” తమిళ్ లో , ఆతర్వాత మళ్ళీ తెలుగులో ఇప్పుడేమో ” హ్యాపీ వెడ్డింగ్ ” ఇలా వరుసగా మూడు సినిమాలు చేస్తే మూడు కూడా డిజాస్టర్ అయ్యాయి . దాంతో నిహారిక పోరాటానికి అర్ధమే లేకుండా పోయింది . ఇంట్లో వాళ్ళని ఎదురించి మరీ హీరోయిన్ అయ్యింది మెగా డాటర్ నిహారిక , కానీ చేసిన మూడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో నిహారిక కుమిలిపోతోంది అంతేకాదు మెగా కుటుంబం కూడా నిహారిక వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతోంది కూడా .

మెగా హీరోలు డజన్ల కొద్దీ వస్తున్న తరుణంలో ఆ కుటుంబం నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక . ఎన్నో అవాంతరాలను అధిగమించి నిహారిక హీరోయిన్ అయితే ఆ ఫలితం లేకుండాపోయింది . ఒక మనసు డిజాస్టర్ కావడంతో కొంత గ్యాప్ తీసుకొని తమిళ్ లో సినిమా చేసింది కట్ చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది ఇక ఇప్పుడేమో హ్యాపీ వెడ్డింగ్ చేసింది దీని ఫలితం కూడా సేమ్ టు సేమ్ దాంతో ప్లాప్ లలో నిహారిక హ్యాట్రిక్ కొట్టేసింది . వరుస ప్లాప్ లు మానసికంగా ఇబ్బంది పెడతాయి , మరి ఈ ఒత్తిడి ని నిహారిక ఎలా అధిగమిస్తుందో చూడాలి . ఇప్పుడైనా ఓ కమర్షియల్ ఫిలిం చేస్తే అప్పుడు హిట్ కొడుతుందేమో చూడాలి .

English Title: niharika completed hattrick flops