నిహారిక ఇప్పుడైనా హిట్ కొడుతుందా ?


Niharika hopes on Suryakantham

మెగా డాటర్ నిహారిక తాజాగా నటించిన చిత్రం ” సూర్యకాంతం ” . ఈ సినిమాని అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నాడు . దాంతో కనీసం ఇప్పుడైనా నిహారిక హిట్ కొడుతుందా ? అన్న ఆసక్తి , అనుమానం నెలకొంది . నిహారిక హీరోయిన్ గా పరిచయమైంది అయితే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు దాంతో మెగా కుటుంబం నుండి వచ్చిన నిహారిక హిట్ కోసం తహతహలాడుతోంది . తాజాగా సూర్యకాంతంతో హిట్ కొట్టాలని ఆశపడుతోంది .

 

ఇక ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ ఏంటంటే దిల్ రాజు రిలీజ్ చేయడానికి ముందుకు రావడమే ! దిల్ రాజు రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అని కాదు కానీ అతడు రిలీజ్ చేస్తున్నాడంటే మినిమమ్ గ్యారెంటీ ఉన్న చిత్రమని భావిస్తారు . సూర్యకాంతం తో నిహారిక హిట్ కొడితే మెగా కుటుంబం మొత్తం సంతోషించడం ఖాయం ఎందుకంటే హీరోయిన్ గా వచ్చి విఫలమయ్యింది అన్న పేరు రాకుండా ఉంటుంది కదా ! అందుకు .

English Title : Niharika hopes on Suryakantham