ఫొటోస్టోరీ: న‌వ్వుల‌తో చంపేస్తోంది!


ఫొటోస్టోరీ: న‌వ్వుల‌తో చంపేస్తోంది!
ఫొటోస్టోరీ: న‌వ్వుల‌తో చంపేస్తోంది!

తెలుగులో వెబ్ సిరీస్‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన తొలి న‌టి, మెగా డాట‌ర్‌ నిహారిక కొణిదెల‌. ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్‌, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్‌ల‌తో ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పెద‌నాన్న‌మెగాస్టార్ చిరంజీవి, తండ్రి నాగ‌బాబుతో వాదించి మ‌రీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. `ఒక మ‌న‌సు`తో తెరంగేట్రం చేసి కొత్త త‌ర‌హా చిత్రాల‌కు మాత్ర‌మే త‌న ప్రాధాన్యం అంటూ సంకేతాల్ని అందించింది.

విల‌క్ష‌ణ త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించిన `ఒరు న‌ల్ల నాల్ పాతు సొల్రే`తో త‌మిళ ప్రేక్ష‌కుల్ని కూడా ప‌ల‌క‌రించింది. హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య కాంతం వంటి చిత్రాల్లో న‌టించింది. ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో చిరు న‌టించిన `సైరా న‌రసింహారెడ్డి` చిత్రంలో చిన్ని పాత్ర‌లో మెరిసింది. రీసెంట్‌గా నిర్మాత‌గా మారి `మ్యాడ్ హౌజ్‌` అనే పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించింది. ఎంత చేసినా త‌న‌కు మాత్రం ఆఫ‌ర్లు రావ‌డం లేదు.

దీంతో సోష‌ల్ మీడియాలో ఫొటోల‌తో దండ‌యాత్ర చేయ‌డం మొద‌లుపెట్టింది. కొంత మంది నెటిజ‌న్స్ ఆమె ఫొటోల్ని పాజిటీవ్ కోణంలో చూస్తున్నా కొంత మంది మాత్రం ఇలాంటి ఫొటో షూట్‌లు నీకు అవ‌స‌ర‌మా అంటే ట్రోల్ చేస్తున్నారు. తాజాగా నిహారి మ‌రో ఫొటోని షేర్ చేసింది. న‌వ్వుతున్న త‌న ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో కొంత మంది నెటిజ‌న్స్ ట్రోల్స్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంత మంది ఆ ఫొటోని ఆస్వాదిస్తూ ల‌వ్‌లీ, స్వీటీ అంటూ కామెంట్‌లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

What makes you smile..?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Credit: Instagram