అల్లు అర్జున్ సిస్టర్ గా నిహారికా!!


Niharika Konidela to play sister character role in Allu Arjun's movie
Niharika Konidela to play sister character role in Allu Arjun’s movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవ్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది.

మరి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకోసం నిహారిక అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ కి అల్లు అర్జున్ సూచించారని వినికిడి.

అల్లు అర్జున్ సిస్టర్ గా నిహారిక కొణిదెల నటిస్తుందని ఫిలిం నగర్ సమాచారం.. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా ఆ చిత్రాలు సరిగా ఆడకపోవడంతో నిహారికా కాస్త వెనకబడిన సంగతి తెలిసిందే..!

మరి సుకుమార్ చిత్రం ద్వారానైనా నిహారికకు హిట్ వస్తుందో.. లేదో చూడాలి మరి.. ప్రస్తుతం నిహారిక సైరా నరసింహా రెడ్డిలో ఓ చిన్న పాత్ర పోషించిన విషయం తెలిసిందే..!