మెగాడాట‌ర్ వ‌రుస పార్టీల‌తో బిజీ బిజీ!మెగాడాట‌ర్ వ‌రుస పార్టీల‌తో బిజీ బిజీ!
మెగాడాట‌ర్ వ‌రుస పార్టీల‌తో బిజీ బిజీ!

నిహారికా కొణిదెల‌ తన బ్యాచిల‌ర్ లైఫ్ చివరి రోజుల్ని ఎంజాయ్ చేస్తోంది. వ‌రుస  పార్టీల‌తో సూపర్ బిజీగా గ‌డిపేస్తోంది. ఈ పార్టీల్లో నిహారికకు కాబోయే వ‌రుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య కూడా సంద‌డి చేస్తున్నారు. గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో కొణిదెల నిహారిక వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఇరు కుటుంబాల‌కు మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుండ‌టంతో నిహారిక వివాహం జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు అబ్బాయి చైత‌న్యతో నిశ్చ‌యించారు. ఆగ‌స్టులో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని ఉయ్‌పూర్‌లో గ‌ల ఉద‌య్ విలాస్‌లో జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు సంబంధ‌వంచిన ఏర్పాట్లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బ్యాచిల‌ర్ పార్టీకి గుడ్‌బై చెప్ప‌బోతున్న నిహారిక పెళ్లి ఫిక్సైన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస‌ పార్టీల‌తో బిజీగా ఉంది.

ఇటీవ‌ల గోవాలో బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చిన నిహారిక ఆ త‌రువాత మెగా ఫ్యామిలీ లోని యంగ్ జ‌న‌రేష‌న్‌కి ప్ర‌త్యేకంగా పార్టీ ఇచ్చింది. తాజాగా మ‌రో బ్యాచ్‌కి త‌న‌కు కాబోయే భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి పార్టీ ఇవ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  ఈ పార్టీకి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కీర‌వాణి త‌న‌యుడు, సంగీత ద‌ర్శ‌కుడు కాల‌ భైరవతో పాటు మ‌రి కొంత మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ వున్నారు.