నిహారిక సినిమాలు మానేసినట్లేనా ?


Niharika
Niharika

మెగా డాటర్ నిహారిక సినిమాలు మానేసినట్లే అనిపిస్తోంది . ఎందుకంటే ఇప్పటివరకు చేసిన ఒక మనసు , హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం చిత్రాలను తెలుగులో చేసింది అలాగే తమిళ్ లో ఒరు నల్లా నాల్ పాతు సోల్రెన్ చిత్రంలో నటించింది . అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది అయితే ఎక్కడ కూడా విజయం సాధించలేకపోయింది పైగా విమర్శల పాలయ్యింది దాంతో నటనకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యిందట .

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సినిమాలలో నటించడం మాత్రం కష్టమే అని అంటున్నారు మెగా కాంపౌండ్ కి చెందిన వాళ్ళు . సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్ లను ఓ పట్టు పడదామని అనుకుంటోందట . అంతేకాదు సినిమాలలో యాక్టింగ్ మానేసి చిత్ర నిర్మాణం మాత్రం చేయాలనే ఆలోచన చేస్తోందట . హీరోయిన్ గా సక్సెస్ కాలేదు మరి నిర్మాత గానైనా సక్సెస్ కొడుతుందా ?