పెళ్లి పుకార్ల‌పై మెగా డాట‌ర్ క్లారిటీ!


పెళ్లి పుకార్ల‌పై మెగా డాట‌ర్ క్లారిటీ!
పెళ్లి పుకార్ల‌పై మెగా డాట‌ర్ క్లారిటీ!

లాఖ్ డౌన్ కార‌ణంగా గ‌త నెల రోజులుగా జ‌న జీవితం స్థంభించిపోయింది. దీంతో అంతా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. లాక్‌డౌన్ మే 7 వ‌ర‌కు పొడిగించ‌డం.. ఇప్ప‌టికే నెల రోజుల లాక్‌డౌన్ పిరియ‌డ్ పూర్తి కావ‌డంతో సినీ తార‌లంతా ఫ్యాన్స్‌తో డైరెక్ట్‌గా ట‌చ్‌లోకి వెళ్లాల‌ని సోష‌ల్ మీడియాతో పాటు టీవీ ఛాన‌ల్స్ లైవ్‌లోకి వ‌చ్చేస్తున్నారు.

ఇటీవ‌ల రాజ‌మౌళి లైవ్‌లోకి వ‌చ్చి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్లడించారు. తాజాగా మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక సోష‌ల్ మీడియా ఇన్ స్టా ద్వారా లైవ్‌లోకి వ‌చ్చింది. త‌న‌కు త‌న ఫ్యామిలీ ఇచ్చిన టైమ్ ఎంతో లేద‌ని వీలైనంత వ‌ర‌కు న‌చ్చిన చిత్రాల్లో న‌టించాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది నిహారిక‌.
త్వ‌ర‌లో ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌బోతున్నాన‌ని, ఇందులో మ‌రింత రొమాంటిక్‌గా క‌నిపిస్తాన‌ని స్ప‌ష్టం చేసింది.

ఇలా చిట్‌ చాట్ సాగుతున్న వేళ ఓ అభిమాని పెళ్లి ప్ర‌స్థావ‌న తీసుకొచ్చాడు. ఇటీవ‌ల ప్ర‌భాస్‌తో పెళ్లి జ‌ర‌గ‌బోతోందంటూ వార్త‌లు వినిపించాయి అందులో నిజ‌మెంత‌? అని అడిగే స‌రికి అదంతా వ‌ట్టి పుకారేన‌ని, త‌న‌కు ప్ర‌భాస్‌ని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేద‌ని, అలాంటి ఆలోచ‌న కూడా లేద‌ని వెల్ల‌డించింది.