పాపం ! నిహారిక కు ఈసారి కూడా నిరాశే


niharika shocked again with happy wedding result

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సత్తా చాటాలని , వీలయితే ఓ వెలుగు వెలిగి పోవాలని ఆశించింది కానీ ఆమె ఆశలు అడియాసలే అవుతున్నాయి . ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో షాక్ కి గురయ్యింది దాంతో కొంత గ్యాప్ తీసుకొని వెబ్ సిరీస్ చేసింది ఇక ఇప్పుడేమో రెండో సినిమా హ్యాపీ వెడ్డింగ్ అంటూ చేసింది . ఈరోజు విడుదలైన హ్యాపీ వెడ్డింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా ఫలితం కూడా వచ్చేసింది దాంతో తీవ్ర నిరాశకు గురయ్యింది నిహారిక .

హ్యాపీ వెడ్డింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది నిహారిక , పెళ్లి కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది . ఇప్పటి అమ్మాయిలకు ప్రతినిధిగా నటించింది కాబట్టి తప్పకుండా ఏ సెంటర్ ప్రేక్షకుల కైనా నచ్చుతుంది అని అనుకుందట కానీ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత వస్తున్న ఫీడ్ బ్యాక్ తో దిగాలు పడింది నిహారిక . రెండో సినిమా కూడా దెబ్బ కొట్టడంతో ఖంగుతింది ఈ మెగా డాటర్ . ద్వితీయ ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఇక మూడో ప్రయత్నం పైనే ఆశలు ఉన్నాయి ఇక . హీరోయిన్ గా సక్సెస్ కొట్టి మెగా డాటరా ? మజాకా నా ? అని అనిపించు కోవాలని ఆశపడుతోంది నిహారిక కానీ ఆమె ఆశలు నెరవేరుతాయా చూడాలి .

English Title: niharika shocked again with happy wedding result