ఫిట్ నెస్ కోసం నిహారిక‌ క‌ష్టాలుఫిట్ నెస్ కోసం నిహారిక‌ క‌ష్టాలు
ఫిట్ నెస్ కోసం నిహారిక‌ క‌ష్టాలు

లాక్డౌన్ ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా జిమ్‌లు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినప్పటికీ అనేక మంది ప్రముఖులు ఇంట్లో వ్యాయామాలను చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో జిమ్‌ల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. అయితే మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక మాత్రం జాగ్ర‌త్త‌లు పాటిస్తూ జిమ్‌లో క‌స‌ర‌త్తులు మాత్రం ఆప‌డం లేదు.

ఇటీవ‌ల గుంటూరుకు చెందిన ఐజీ త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక నిశ్చితార్థం జ‌రిగిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌బోతోంది. రాబోయే రెండు నెల‌ల్లో పెళ్లి కూతురిగా మ‌రింత బెట‌ర్‌గా క‌నిపించాల‌ని నిహారిక‌ని క‌ఠోరంగా శ్ర‌మిస్తోంది. ఇటీవ‌ల నిహారిక హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో క‌లిసి జిమ్‌లో వ‌ర్క‌వుట్‌లు చేసింది.

దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో నిహారిక షార్ట్ ధ‌రించి బ్లాక్ డ్రెస్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. పెళ్లి నాటికి లుక్ ప‌రంఆ మ‌రింత బెట‌ర్‌గా క‌నిపించ‌బోతోంది. ఎంగేట్‌మెంట్‌కి ముందు అంగీక‌రించిన త‌మిళ చిత్రం నుంచి నిహారిక ఇటీవ‌లే త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

Friends don’t let friends . . NOT EXERCISE! #workoutbuddies @niharikakonidela @charan.tagore

A post shared by Lavanya T (@itsmelavanya) on