భార్య‌తో స‌హా త‌న‌కు తానే లాక్‌డౌన్ విధించుకున్న నిఖిల్‌

భార్య‌తో స‌హా త‌న‌కు తానే లాక్‌డౌన్ విధించుకున్న నిఖిల్‌
భార్య‌తో స‌హా త‌న‌కు తానే లాక్‌డౌన్ విధించుకున్న నిఖిల్‌

యంగ్ హీరో నిఖిల్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపుగా రెండేళ్ల‌వుతోంది. లాక్‌డౌన్ స‌డ‌లింపు త‌రువాత ప్రేమించిన యువ‌తిని నిఖిల్ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లి త‌రువాత సినిమాల విష‌యంలో స్పీడు పెంచిన నిఖిల్ ప్ర‌స్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌కు ముందు ఈ రెండు చిత్రాల‌ని సెట్స్ పైకి తీసుకెళ్లినా ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ ఉదృతంగా మార‌డంతో ఈ రెండు చిత్రాల షూటింగ్‌ల‌కి తాత్కాలికంగా బ్రేకిచ్చారు.

సుకుమార్ నిర్మాణంలో `18 పేజెస్‌`, చందూ మొండేటి డైరెక్ష‌న్‌లో `కార్తికేయ 2` చిత్రాల్లో న‌టిస్తున్న నిఖిల్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్ కి బ్రేకిచ్చిన నిఖిల్ క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో త‌న భార్య‌తో క‌లిసి త‌న‌కు తానే లాక్‌డౌన్ విధించుకున్నార‌ట‌. బ‌య‌ట అడుగు పెట్టేందుకు తాను ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, త‌మ‌కు తామే సెల్ప్ లాక్‌డౌన్‌ని విధించుకున్నామ‌ని చెబుతున్నాడు.

త‌న‌కు నిఖిల్ సిద్ధార్థ్ త‌న భార్య పల్లవితో కలిసి స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తిరిగి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డిన త‌రువాతే మ‌ళ్లీ త‌ను న‌టిస్తున్న సినిమాల షూటింగ్‌ల‌ని రీ స్టార్ట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. అంత వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం కావాల‌ని నిఖిల్ నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్న‌రు.