నిఖిల్ భయపడ్డాడా ? నిఖిల్ భయపడ్డాడా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది జగన్ ప్రభుత్వమే అంటూ అన్ని సర్వేలు చెబుతున్నాయ్ దాంతో కాబోలు లేక మరో కారణమో కానీ నిఖిల్ మొత్తానికి భయపడి తన రాజకీయ పర్యటన పై ఓ ప్రకటన జారీ చేసాడు . నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదు , ప్రచారం చేయడం లేదు కేవలం నాకు ఎప్పటినుండో తెలిసిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో కేవలం మద్దతు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాను తప్ప ప్రచారానికి కాదు అంటూ చెప్పుకొచ్చాడు .

వాస్తవంగా నిఖిల్ ప్రచారం చేసాడు పత్తికొండలో కానీ నేను తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయలేదు అని అంటున్నాడు నిఖిల్ . అంటే తెరవెనుక ఏదో జరిగి ఉంటుంది అందుకే ఇలా ప్రకటన జారీ చేసి ఉంటాడు నిఖిల్ . భయపడి ఇలా ప్రకటన చేసి ఉంటాడేమో అని భావిస్తున్నారు . ఇక సినిమాల విషయానికి వస్తే …….. నిఖిల్ నటించిన ” అర్జున్ సురవరం ” మే 1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు .