విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్Nikhil comments on vijay devarakonda's tweet

విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చాడు హీరో నిఖిల్ . నోటా పరాజయం పొందన నేపథ్యంలో కొంతమంది సంతోషపడ్డారని , పార్టీ చేసుకునే మూడ్ లో ఉన్నారని , కొన్ని తప్పులు జరిగినా మళ్ళీ సత్తా చూపిస్తానని నా ధోరణి మార్చుకునే ప్రసక్తిలేదని పెద్ద నోట్ రాసి సోషల్ మీడియాలో పెట్టాడు విజయ్ దేవరకొండ . అయితే దానికి పెద్దగానే కౌంటర్ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ . మనం పని చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మన చేతుల్లో అంతా ఉందనుకోవడం వట్టి భ్రమే ! అవుతుంది . ప్రపంచం మొత్తాన్ని పభావితం చేస్తా అనే యాటిట్యూడ్ సరైంది కాదని , ఇక్కడ ఎవరూ అంత ప్రాముఖ్యత కాదని నేరుగా విజయ్ దేవరకొండ పైనే విమర్శలు చేసాడు . నువ్విక్కడ పెద్ద తోపు కాదు అని నెగెటివ్ గా తీసుకుంటే అర్ధం వచ్చేలా ఉంది . ఇక పాజిటివ్ గా తీసుకుంటే కేవలం మనం మన ఎఫెర్ట్ పెట్టి సినిమాల్లో నటించడం తప్ప ఫలితం మన చేతుల్లో లేదని చెబుతున్నాడు నిఖిల్ .

అయితే నిఖిల్ ట్వీట్ పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే నేరుగా విజయ్ దేవరకొండ ని ఇన్సల్ట్ చేసినట్లుగా నిఖిల్ ట్వీట్ ఉంది మరి . పాజిటివ్ గా తీసుకుంటే ఒకలా , నెగెటివ్ గా తీసుకుంటే మరోలా ఉంటుంది కాబట్టి ఈ గొడవ ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి . నోటా చిత్రం తెలుగు , తమిళ బాషలలో కూడా ఫ్లాప్ అయ్యింది . దాంతో విజయ్ దేవరకొండ కాస్త అసహనంతో ఉన్నాడు .

English Title: Nikhil comments on vijay devarakonda’s tweet