నిఖిల్ కు సీక్వెల్ కలిసి వస్తుందా ?


nikhil siddharth
nikhil siddharth

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు . చందు మొండేటి దర్శకత్వంలో 2014 లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది . అసలు ఆ సినిమా రిలీజ్ కి ముందే సీక్వెల్ చేయనున్నట్లుగా చూచాయగా సినిమా ఎండింగ్ లోనే ప్రకటించారు అప్పటి చిత్ర బృందం . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు . అక్టోబర్ లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

అయితే తెలుగునాట సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడలేదు , కానీ కార్తికేయ 2 పై మాత్రం నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడట . ఇక చందు మొండేటి కూడా తన కెరీర్ ని పణంగా పెట్టి ఈ సినిమా చేస్తున్నాడు . ఇటీవల సరైన హిట్ కొట్టలేకపోయాడు చందు మొండేటి . సవ్యసాచి రూపంలో ప్లాప్ చవిచూశాడు . నిఖిల్ కూడా సక్సెస్ కోసం సుబ్రహ్మణ్యం స్వామినే నమ్ముకున్నాడు . 2014 లో లాగే 2020 లో తనకు కార్తికేయ 2 సక్సెస్ ని ఇస్తుందని భావిస్తున్నాడట .