నిఖిల్ గౌడ మ‌ళ్లీ యాక్ష‌న్‌నే నమ్ముకున్నాడుగా?


నిఖిల్ గౌడ మ‌ళ్లీ యాక్ష‌న్‌నే నమ్ముకున్నాడుగా?
నిఖిల్ గౌడ మ‌ళ్లీ యాక్ష‌న్‌నే నమ్ముకున్నాడుగా?

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జాగ్వ‌ర్‌` సినిమాతో క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి గౌడ త‌న‌యుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇదే చిత్రం తెలుగులోనూ విడుద‌లైంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు నిఖ‌ల్ గౌడ‌. కొంత విరామ‌బం త‌రువాత మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముంఉదుకు రాబోతున్నాడు.

నిఖిల్ కుమార్ న‌టిస్తున్న తాజా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `రైడ‌ర్‌`. విజ‌య్ కుమార్ కొండ ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. నిఖిల్ గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. ల‌హ‌రి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై చంద్ర మ‌నోహ‌ర్ నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం నిఖిల్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ చిత్ర టీజ‌ర్‌ని రిలీజ్ చేసింది.

క‌శ్మీరా ప‌ర‌దేశి ఇందులో నిఖిల్‌కు జోడీగా న‌టిస్తోంది. గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ మూవీ కూడా మాస్ మ‌సాలా యాక్ష‌న్ స‌న్నివేశాల స‌మాహారంగా రూపొందిన‌ట్టు క‌నిపిస్తోంది. టీజ‌ర్‌‌లోని యాక్ష‌న్ ఘ‌ట్టాలు, అర్జున్ జ‌న్య సంగీతం, శ్రీ‌ష కుడువ‌ల్లి ఫొటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు.