నిఖిల్ సినిమా టైటిల్ మారుతోంది


Nikhil next movie announcment tomorrow

నిఖిల్ హీరోగా నటించిన ముద్ర చిత్రం విడుదల కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ముద్ర టైటిల్ విషయంలో పెద్ద గొడవే జరిగింది నిఖిల్ కు నిర్మాత నట్టికుమార్ కు . అయితే ఆ తర్వాత అసలు విషయాలు తెలియడంతో నిఖిల్ తన తప్పు తెలుసుకొని సైలెంట్ అయ్యాడు . కట్ చేస్తే ఇప్పుడు ముద్ర అనే టైటిల్ ని తీసేసి మరో టైటిల్ ని రేపు అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆ టీమ్ .

తమిళంలో సూపర్ హిట్ అయిన కనితన్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్ . ఇక ఈ సినిమా గత రెండు నెలలుగా విడుదల అని అంటున్నారు కానీ విడుదల మాత్రం కావడం లేదు . ఇక ఇప్పుడేమో మార్చి లో అని అంటున్నారు . అయితే రేపు టైటిల్ తో పాటు సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ప్రకటించనున్నారు . నిఖిల్ కు హిట్స్ లేక  రేసులో  లేకుండాపోయాడు .

English Title: Nikhil next movie announcment tomorrow