ఇదే లాస్ట్ రీమేక్ అంటోన్న నిఖిల్


Nikhil says Arjun Suravaram is his last remake
Nikhil says Arjun Suravaram is his last remake

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం కొంచెం రిలాక్స్ అయ్యాడనే చెప్పాలి. తన లేటెస్ట్ సినిమా అర్జున్ సురవరం ఏడాదికి పైగా వాయిదా పడడంతో తీవ్ర మానసిక సంక్షోభానికి గురయ్యాడు నిఖిల్. ఎప్పుడూ తన కెరీర్ లో ఇంతలా సఫర్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు. అయితే స్నేహితులు. ఫ్యామిలీ ఉండడం వల్లే తాను ఈ ఇబ్బంది నుండి బయటపడ్డానని అన్నాడు. అయితే మొత్తానికి అర్జున్ సురవరం నవంబర్ 29న అన్ని అడ్డంకులూ దాటుకుని విడుదలైంది. ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. క్రిటిక్స్ కూడా సినిమాకు యావరేజ్ రేటింగులు ఇచ్చారు. దాంతో నిఖిల్ పనైపోయింది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. యావరేజ్ రేటింగులు వచ్చినా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. వీకెండ్ లో చాలా షోస్ హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. మండే కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది కానీ మరీ ఆందోళన చెందాల్సినంత కాదు. దీంతో నిఖిల్ ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఫీలవుతున్నాడు. చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు. సినిమా మరీ ఆలస్యం కావడంతో ఫలితంపై ఎక్కువ ఆశలేం పెట్టుకోలేదు.

ఒకసారి అర్జున్ సురవరం వీకెండ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ చూస్తే..

నైజాం: Rs 90.00 లక్షలు

సీడెడ్: Rs 46.00 లక్షలు

గుంటూరు: Rs 53.00 లక్షలు

వైజాగ్: Rs 55.00 లక్షలు

ఈస్ట్ గోదావరి :Rs 34.00 లక్షలు

వెస్ట్ గోదావరి :Rs 28.00 లక్షలు

నెల్లూరు: Rs 23.00 లక్షలు

కృష్ణ: Rs 38.00 లక్షలు

ఫస్ట్ వీకెండ్ షేర్ మొత్తం: Rs. 3.67 కోట్లు

ఇక ఈ సినిమా తమిళంలో హిట్ అయిన కనిదన్ కు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెల్సిందే. ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ చిత్రంలో జర్నలిస్ట్ అయిన నిఖిల్ ఏ విధంగా అదే కుంభకోణంలో ఇరుక్కున్నాడో, దాన్నుండి ఎలా బయటపడ్డాడో అన్నది ఈ చిత్రంలో చూపించారు. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు.

నిఖిల్ లాస్ట్ 2 సినిమాలు కూడా రీమేకే కావడం విశేషం. అర్జున్ సురవరం కనిదన్ కు రీమేక్ కాగా, కిరాక్ పార్టీ.. కిరిక్ పార్టీ అనే చిత్రానికి రీమేక్. ఇలా అనుకోకుండా రెండు రీమేక్ సినిమాలు వరసగా చేయాల్సి వచ్చిందని నిఖిల్ తెలిపాడు. బేసిగ్గా రీమేక్ చేయడానికి నిఖిల్ వ్యతిరేకమట. దాంతో ఇక నుండి రీమేక్ సినిమాలు చేయనని చెబుతున్నాడు నిఖిల్. తెలుగులో ఇలా కొందరు హీరోలు రీమేక్ సినిమా సినిమాల్లో నటించడానికి అస్సలు ఒప్పుకోరు. వారిలో మహేష్ బాబు ప్రముఖులు. అలాగే ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించరు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నిఖిల్ కూడా చేరాడు. ప్రస్తుతం నిఖిల్ నటించిన తర్వాతి చిత్రం కార్తికేయ 2 చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇది కాకుండా మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నట్లు ప్రకటించాడు నిఖిల్.