ఆర్జీవీని కుక్క‌తో పోల్చిన యంగ్ హీరో!ఆర్జీవీని కుక్క‌తో పోల్చిన యంగ్ హీరో!
ఆర్జీవీని కుక్క‌తో పోల్చిన యంగ్ హీరో!

స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ మినీ మూవీని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్, గ‌డ్డి తింటావా.. సాంగ్‌, తాజాగా ట్రైల‌ర్‌తో ర‌చ్చ చేస్తున్న వ‌ర్మ‌ని క‌ట్ట‌డి చేయ‌డం కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ తాజాగా యుద్ధం ప్ర‌క‌టించారు.

వ‌ర్మ‌పై వ‌రుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించ‌డం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే `ప‌రాన్న‌జీవి`, పార్న్ జీవి అంటూ మినీ సినిమాలు మొద‌ల‌య్యాయి. ఇదిలా వుంటే యంగ్ హీరో నిఖిల్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఉద్దేశిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ రోజు వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్` ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై హీరో నిఖిల్ ఘాటుగా స్పందించారు.

రామ్ గోపాల్ వ‌ర్మ‌ని కుక్క‌తో పోలుస్తూ సోష‌ల్ మీడియాలో నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `శిఖ‌రంని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హా శిఖ‌రం త‌ల‌తిప్పి చూడ‌దూ.. మీకు అర్థ‌మైందిగా ` అంటూ #powerstar #Pawankalyan హ్యాష్ ట్యాగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర్మ చేస్తున్న ప‌నికి నిఖిల్‌తో పాటు చాలా మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్మ‌పై ర‌గిలిపోతున్నారు. నిఖిల్ పోస్ట్‌పై వ‌ర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Credit: Twitter