యాక్టర్ డాక్టర్ ని ప్రేమించాడు


Nikhil siddharth
Nikhil siddharth

యంగ్ హీరో ‘నిఖిల్ సిద్దార్థ్‘ సినిమాల విషయంలో వెనుకపడ్డాడు. అందుకేనేమో సమయం వృధా చేయకుండా తన కాబోయే సతీమణి గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు. ఆ విషయాన్నీ తానే స్వయంగా ‘మంచు లక్ష్మి ప్రసన్న’హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీటప్ విత్ స్టార్’ ప్రోగ్రామ్ లో వెల్లడించాడు. ఇంకా రిలీజ్ కి నోచుకోని ‘అర్జున్ సురవరం’ సినిమా గురించి మాట్లాడలేదు కానీ తన ప్రేమ విషయం అలాగే తన కలల రాకుమారి గురించి వివరించారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా‘ సినిమా తర్వాత నిఖిల్ కి సరైన హిట్ లేదు. అర్జున్ సురవరం సినిమా ఎప్పుడో 2019 మే నెలలో విడుదల అవ్వాల్సిన సినిమా అది. ఇప్పుడు చందు మొండేది దర్శకత్వంలో రెండవసారి నటిస్తున్న సినిమా ‘కార్తికేయ 2’ సినిమా సెట్స్ మీద ఉంది. ఇదంతా వివరించని నిఖిల్ గారు తన ప్రేమ వ్యవహరాన్ని మాత్రం లక్ష్మి గారి ముందు వివరించారు.

తాను ఒక డాక్టర్ ని ప్రేమిస్తున్నాని చాలా వినయంగా చెప్పేసారు. పేరు మాత్రం చెప్పకుండా…..ఆమే అంటే “నాకు చాలా ఇష్టం….నేను షూటింగ్స్ లో బిజీగా ఉన్నా, ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లినా, లేదా ఇంకొక సందర్భం ఏం వచ్చినా కూడా నన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యదు. నా ఫోన్ ని కూడా అస్సలు చెక్ చెయ్యదు. ఇంకా నేను వేరే ఏదైనా సమస్య గురించి మాట్లాడితే నన్ను ప్రశాంతంగా ఆలోచించమని అనవసరంగా అలా చేయొద్దు, ఇలా డిసైడ్ అవ్వొద్దు అంటూ నాకు మంచి సలహాలు ఇస్తుంది” అని తన ప్రేమ వ్యవహారం, అలాగే తన లవర్ గురించి వివరించారు.

మరి ఇంత చెప్పిన నిఖిల్ గారు తాను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు మాత్రం చెప్పలేకపోయారు. లక్ష్మి గారు కూడా పేరు ఎలా అయినా నిఖిల్ నోటి ద్వారా  చెప్పించాలి అనుకుంది కానీ, విఫలం అయ్యింది. మొత్తానికి యంగ్ హీరో ప్రేమ రహస్యం చెప్పించగలిగింది లక్ష్మి ప్రసన్న. ముందు ముందు ఇంకా ఎవరితో ఏం చెప్పిస్తుందో? అని ‘ఫీటప్ విత్ స్టార్’ ప్రోగ్రామ్ మీద జనాలకి రోజు రోజు కి ఆసక్తి పెరుగుతుంది.