మళ్ళీ కొత్త డేట్ ప్రకటించాడు ఇప్పుడైనా వస్తాడా ?


మళ్ళీ కొత్త డేట్ ప్రకటించాడు ఇప్పుడైనా వస్తాడా ?
Nikhil Siddharth and Lavanya Tripathi

నిఖిల్ అర్జున్ సురవరం చిత్రానికి రిలీజ్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి . ఇప్పటికే పలుమార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడగా తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు . ఇంతకీ అర్జున్ సురవరం కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా …….. మే 17 . మే 9 న మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదల అవుతోంది . కానీ మే 17 న అర్జున్ సురవరం రిలీజ్ అంటే డౌటే ! ఎందుకంటే మహర్షి సినిమా బాగుందనుకో థియేటర్ లు దొరకడం కష్టమే !

ఒకవేళ మహర్షి డిజాస్టర్ అయితే తప్ప నిఖిల్ కు థియేటర్ లు దొరకవు . మహర్షి రిజల్ట్ ని బట్టి మళ్ళీ అర్జున్ సురవరం రిలీజ్ డేట్ లో మార్పు ఉండొచ్చు . అసలు అర్జున్ సురవరం ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అన్నారు కానీ కుదరలేదు ఇక అప్పటి నుండి ఫుట్ బాల్ ఆట లాగా అవుతోంది పాపం . ఎన్ని డేట్ లు ప్రకటించినా చివరి నిమిషంలో ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతూనే ఉంది . మరి ఈ డేట్ అయినా ఫిక్స్ అవుతుందా ? లేక మారుతుందా ? మహర్షి రిలీజ్ అయితే కానీ తెలీదు .