మే 1 కి వాయిదాపడిన నిఖిల్ చిత్రం


Nikhil's Arjun suravaram gets new release date

నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం చిత్రం రెండు నెలలుగా వాయిదాపడుతూనే ఉంది . అసలు గత ఏడాది నవంబర్ లోనే రిలీజ్ అన్నారు కానీ కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ గా ఉండటంతో వీలుకాలేదు జనవరి అనుకున్నారు అదీ కుదరలేదు . తర్వాత మార్చిలో అన్నారు వాయిదాపడుతూ మార్చి 29 న డేట్ ఫిక్స్ చేసారు . కట్ చేస్తే ఇప్పుడు కూడా వాయిదాపడింది . మే 1న నిఖిల్ నటించిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది .

 

అయితే ఇప్పుడు మాత్రం తప్పకుండా మే 1న రిలీజ్ చేస్తామని అంటున్నారు ఆ చిత్ర బృందం . తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు . ఈ సినిమాపై నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పాపం . మరి ఏమౌతుందో చూడాలి మే 1న .

English Title : Nikhil’s Arjun suravaram gets new release date