దెబ్బకు భయపడిపోయారు


నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం చిత్రాన్ని మే 1 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు , ఆమేరకు ఈరోజున హైదరాబాద్ లో అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ వేడుక కు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు కానీ ఒకవైపు ఎవెంజర్స్ మరోవైపు మహేష్ బాబు  సినిమాలు వస్తుండటంతో దెబ్బకు భయపడిపోయి తన సినిమాని వాయిదావేసుకున్నాడు . ఇక మహేష్ బాబు మహర్షి చిత్రం రిలీజ్ అయ్యాక మరో మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేస్తారట . 
 
తమిళంలో ఘనవిజయం సాధించిన కనితన్ అనే చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు . ఈ సినిమాపై నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . అయితే ఈ సినిమా మాత్రం నాలుగు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది ఏదో ఒక కారణంతో . పాపం మరి మే నెలలోనైనా మంచి డేట్ దొరుకుతుందా నిఖిల్ కు .