నిఖిల్ సినిమా నెక్స్ట్ టైటిల్ కార్తికేయ 2 కాదా?

nikhils karthikeya 2 gets new title
nikhils karthikeya 2 gets new title

యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది అసలు ఎప్పుడు విడుదలవుతుందో, అసలు విడుదలవుతుందో లేదో అనుకున్న అర్జున్ సురవరం కాస్తా విడుదలై మంచి హిట్ ను సాధించింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ లో కూడా అందరి చేత శభాష్ అనిపించుకుంది. అక్కడ కూడా డీసెంట్ వ్యూస్ వచ్చాయి. ఇక వ్యక్తిగత జీవితం విషయంలో కూడా నిఖిల్ హ్యాపీ. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న నిఖిల్ పెళ్ళికి సిద్ధపడుతున్నాడు. అలాగే ఎప్పటినుండో మొదలుపెట్టాలనుకుంటున్న కార్తికేయ సీక్వెల్ పనులు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇక లాంచ్ చేయడమే తరువాయి.

నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. కార్తికేయను తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమే దాదాపుగా కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఇక ఈ సీక్వెల్ ను మార్చ్ 2న లాంచ్ చేసి అదే నెలలో షూటింగ్ ను కూడా స్టార్ట్ చేస్తారు.

ఈ సినిమాకు మొదటి నుండి కార్తికేయ 2 అని అంటున్నారు కానీ అది కేవలం వర్కింగ్ టైటిల్ గా ఉండబోతోందని సమాచారం. అసలు టైటిల్ గా “దైవం మానుష్య రూపేణా” అన్న టైటిల్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఈ టైటిల్ చూడగానే మహేష్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఖలేజా సినిమా గుర్తొచ్చింది కదా. అక్కడ మూవీ థీమ్ ప్లాట్ గా ఉన్న ఈ వ్యాక్యం ఇప్పుడు నిఖిల్ మూవీకు టైటిల్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ చిత్రంగా ఇది నిలవనుంది. మరి నిఖిల్ ఈ సినిమాతో తన హిట్స్ ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.