ఆ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడుతుందిNikhil's Mudra postponed again

యంగ్ హీరో నిఖిల్ నటించిన తమిళ రీమేక్ చిత్రం ముద్ర. ఈ సినిమాని నవంబర్ లో విడుదల చేయాలనుకున్నారు , కుదరలేదు డిసెంబర్ అన్నారు అది కూడా కుదరలేదు ఇక ఇప్పుడేమో జనవరి నెలాఖరు అన్నారు కానీ ఇప్పుడు కూడా కుదిరేలా కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడుతుంది అన్న అసహనం నెలకొంది.

నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. తమిళ దర్శకుడు టి ఎస్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇక ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ చిత్రంపై నిఖిల్ మాత్రమే కాదు లావణ్య త్రిపాఠి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో నిఖిల్ హిట్ ముద్ర వేస్తుకుంటాడా చూడాలి.

English Title: Nikhil’s Mudra postponed again