“అర్జున” యుద్ధం ఈ సారి ఎవరిమీద?


arjun suravaram
arjun suravaram

యువ కథానాయకుడు “నిఖిల్ సిద్ధార్థ్” మొదట సంబరం అనే సినిమాలో ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలో చేసాడు కానీ అది ఎవరికి తెలియయదు. ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాలో రాజేష్ పాత్ర మాత్రం అందరిని బాగా నవ్వించింది. ఆ తర్వాత వరుసగా 7 ఫ్లాప్ సినిమాలు చేసాడు వాటిని జనం తిరస్కరించారు.

అందులో యువత సినిమా కొద్దోగొప్పో నిఖిల్ కి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆలా ఫ్లాప్ సినిమాలు వెంట పడుతున్నాయి అని తెలిసి కొత్త కాన్సెప్ట్స్ ని వెతుకుతూ ఉండగా ‘సుధేర్ వర్మ’ దర్శకత్వంలో ‘స్వామి రారా’ చేసాడు. ఇక అంతే సుడి గిర్రున తిరిగింది మనవాడికి. వెంటనే కార్తికేయ, సూర్య VS సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలా ద్వారా జనాలకి ఇంకా దగ్గర అయ్యాడు.

తన సినిమాలు యువతకి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ప్రతి సినిమాని నిలబెట్టాలని చూస్తున్నాడు. కిరాక్ పార్టీ సినిమా ద్వారా మళ్ళి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న నిఖిల్. ‘అర్జున్ సురవరం’ సినిమాని లైన్ లో పెట్టాడు. సినిమా ఈ సంవత్సరం ఎప్పుడో మే నెలలో విడుదల అవ్వాలి అక్టోబర్ వచ్చినా కూడా ఇంకా విడుదల అవ్వలేదు. అయితే ఈ వారంలో డేట్ ప్రకటన ఇస్తా అన్నాడు నిఖిల్.

అనుకున్నట్టే సినిమా డేట్ ని ప్రకటించారు యూనిట్ వాళ్ళు. సినిమా నవంబర్ 8 2019 తేదీనా విడుదల చేయబోతున్నారు. ఇది ఇంకా బయటి మాట మాత్రమే కచ్చితంగా డేట్ ఇదే అని సినిమా యూనిట్ వాళ్ళు కూడా చెప్పలేక పోతున్నారు అని అంటున్నాయి సినిమా వర్గాలు. తమిళ సినిమా ‘కనితన్’ కి రీమేక్ గా తెలుగులో వస్తుంది ఈ ‘అర్జున్ సురవరం’ సినిమా. సినిమాకి ముందుగా “ముద్ర” అని పేరు అనుకున్నారు కానీ అనుకోకుండా పేరు మార్చారు.