నిఖిల్ కొత్త చిత్రానికి భారీ ఆఫర్


nikhil's new movie mudra creates record in satellite rightsయంగ్ హీరో నిఖిల్ తాజాగా ” ముద్ర ” అనే చిత్రంలో నటిస్తున్నాడు . తమిళనాట విడుదలై సూపర్ హిట్ అయిన ” కనితన్ ” చిత్రాన్ని తెలుగులో ” ముద్ర ” అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు . తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన టి ఎన్ సంతోష్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం . ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మా ఛానల్ భారీ ఆఫర్ ఇచ్చిందట శాటిలైట్ హక్కుల కోసం . అయిదున్నర కోట్ల కు తెలుగు సాటిలైట్ హక్కులతో పాటుగా హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారట స్టార్ మా .

నిఖిల్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది ” కిర్రాక్ పార్టీ ” చిత్రం . కన్నడంలో పెద్ద హిట్ అయిన కిరాక్ పార్టీ ని తెలుగులో రీమేక్ చేస్తే పెద్ద హిట్ కొట్టొచ్చు అని ఆశపడ్డాడు నిఖిల్ కానీ అతడి ఆశలన్నీ అడియాసలయ్యాయి , అంచనాలు తలకిందులు చేస్తూ ప్లాప్ అయ్యింది . దాంతో కొంత గ్యాప్ తీసుకొని తమిళనాట హిట్ అయిన కనితన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు నిఖిల్ . ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ముద్ర చిత్రం కాగా షూటింగ్ దశలోనే భారీ ఆఫర్ రావడంతో నిర్మాత చాలా సంతోషంగా ఉన్నాడట . లావణ్య త్రిపాఠీ నిఖిల్ సరసన నటిస్తోంది . నిఖిల్ తో పాటుగా లావణ్య త్రిపాఠీ కి కూడా సక్సెస్ చాలా అవసరం , ఈ భామ కూడా ప్లాప్ ల జాబితాలో చేరిపోయింది అలాగే నిర్మాత ఠాగూర్ మధు కూడా సక్సెస్ కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నాడు .

English Title: nikhil’s new movie mudra creates record in satellite rights