స‌మంత పాత్ర‌లో ఆది పినిశెట్టి ల‌వ‌ర్‌!


Nikki galrani play samantha's role in rangasthalam remake
Nikki galrani play samantha’s role in rangasthalam remake

కామెడీ హార‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర్‌గా నిలిచిన హీరో రాఘ‌వ ‌లారెన్స్‌. `ముని` చిత్రంతో కొత్త బాట ప‌ట్టిన లారెన్స్ క్ర‌మ క్ర‌మంగా త‌న పంథాకు భిన్న‌మైన చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల క‌ల్యాణ్‌రామ్ న‌టించిన `ప‌టాస్‌` చిత్రాన్ని రీమేక్ చేసిన లారెన్స్ క‌న్ను తాజాగా మ‌రో తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్‌పై ప‌డింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకుంది.

న‌టుడిగా రామ్‌చ‌ర‌ణ్ ని మ‌రో మెట్టు ఎక్కించింది. సౌండ్ ఇంజ‌నీర్ చిట్టిబాబు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ జీవించాడ‌ని విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇదే చిత్రాన్ని త్వ‌ర‌లో త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌లో రాఘ‌వ లారెన్స్ న‌టించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ఇందులో చిట్టిబాబుగా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌కు ఎంత ప్రాముఖ్య‌త వుందో రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో న‌టించిన స‌మంత పాత్ర‌కూ అంతే ప్రాముఖ్య‌త వుంది. అచ్చ‌మైన ప‌ల్లెటూరి యువ‌తిగా రామ‌ల‌క్ష్మీ పాత్ర‌ని సామ్ అద్భుతంగా పోషించింది. ఆమె పాత్ర‌ని త‌మిళ రీమేక్‌లో నిక్కీ గ‌ల్రానీ పోషించ‌నుంద‌ని తెలిసింది. హీరో ఆది పినిశెట్టి తో నిక్కీ గ‌ల్రానీ  ప్రేమ‌లో వున్న విష‌యం తెలిసిందే.  స‌మంత పాత్ర‌కు నిక్కీ అయితే బాగుంటుంద‌ని లారెన్స్ భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారు? .. ఎప్పుడు మొద‌ల‌వుతుంది వంటి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే మేక‌ర్స్ వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.