వైర‌స్ బారిన ప‌డిన ‌ఆది పినిశెట్టి ల‌వ‌ర్!వైర‌స్ బారిన ప‌డిన ‌ఆది పినిశెట్టి ల‌వ‌ర్!
వైర‌స్ బారిన ప‌డిన ‌ఆది పినిశెట్టి ల‌వ‌ర్!

క‌రోనా వైర‌స్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాద్య వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెల‌సిందే. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. హీరో విశాల్‌, ఆయ‌న తండ్రి, బండ్ల గ‌ణేష్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కుటుంబం క‌రోనా బారి నుంచి కోలుకున్నారు.

తాజాగా మ‌రో హీరోయిన్ క‌రోనా బారిన ప‌డింది. ఇటీవ‌ల హీరో ఆది పినిశెట్టితో ప్రేమ‌లో వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నిక్కీ గ‌ల్రానీకి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు తెలిసింది. స్వ‌యంగా ఈ వార్త‌ని నిక్కీగ‌ల్రానీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. గ‌త వారమే టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం చికిత్స చేయించుకుంటున్నాన‌ని, త‌న‌కు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌ల‌ని పేర్కొంది. అలాగే అంతా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, ఇంట్లోనే వుండండ‌ని, జాగ్ర‌త్త‌గా వుండండ‌ని స్ప‌ష్టం చేసింది.

నిక్కీ గ‌ల్రానీ తెలుగులో సునీల్ హీరోగా న‌టించిన `కృష్ణాష్ట‌మి` చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం లారెన్స్ హీరోగా త‌మిళంలో రీమేక్ కాబోతున్న `రంగ‌స్థ‌లం`లో స‌మంత పాత్ర కోసం నిక్కీ గ‌ల్రానీని చిత్ర బృందం ఎంపిక చేసింది.